![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -549 లో... చూడమ్మా ప్రేమ.. మాట మాట పెరిగి గొడవ జరిగింది. దాన్ని ఆవేశంలో జరిగిన గొడవగానే చూడు. దూరం పెంచుకుంటూ పోతే మనసుల మధ్య కూడా తేరుకోలేనంత దూరం పెరుగుతుందని ప్రేమతో రామరాజు అంటాడు. మామయ్య.. మీ అందరిపై నాకు కోపం లేదు. కానీ నాకు ధీరజ్ వద్దు అని అంటుంది. ఇంతమంది బతిమాలుతున్నా ఇంకా ఇదే మొండితనమా అని నర్మద అనగానే ఇది మొండితనం కాదు అక్కా.. బాధ. కోపంలో ధీరజ్ నాకు ఇచ్చిన మాట తప్పాడు. నా చిన్న తప్పును అందరి ముందు చెప్పి నన్ను నవ్వులపాలు చేశాడు. ఆడపిల్ల మనసును అర్థం చేసుకోలేని భర్త నాకు వద్దని ప్రేమ చెప్పేసి ఏడుస్తూ వెళ్లిపోతుంది. అందరు బాధపడుతుండగా వల్లీ మాత్రం లోలోపల సంతోషిస్తుంది.
భాగ్యం ఇంట్లో మాత్రం ప్రేమ–ధీరజ్ విడిపోయారని నాటకంగా ఏడుస్తూ, ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటారు. సూపర్ అమ్మడు.. ప్రేమ పావురాల కాపురాన్ని బీభత్సంగా విడగొట్టేశావు. నా కూతురివి అనిపించుకున్నావని భాగ్యం అనగానే ఇక నా ఫుల్ ఫోకస్ నర్మద కాపురాన్ని కూల్చడమే అని వల్లి అంటుంది. నాన్నగారూ.. మా రైస్ మిల్లులో దొరికినన్ని లక్షలు మడతెట్టేయండి. అంటే దొంగతనమా అని ఆనందరావు అనగానే అలాంటిదే.. కానీ దొరలా అంటూ తన పగ తీర్చుకునే ప్లాన్ చెప్తుంది. మరోవైపు ధీరజ్ బాధగా కూర్చుంటే నర్మద, వేదవతి, తిరుపతి, చందు, అమూల్యలు ఓదారుస్తారు. నేను బాధపడటం లేదు. ప్రేమ కోపంలో అలా మాట్లాడింది. మేమిద్దరం ఒకరిని విడిచి ఒకరం ఉండలేం. దాన్ని తిరిగి మన ఇంటికి ఎలా తీసుకురావాలో ఆలోచిస్తున్నానని చెప్పి, “రేపటిలోగా ప్రేమను ఇంటికి తీసుకురాకపోతే అని అనేసి ధీరజ్ వెళ్లిపోతాడు. డైలాగ్ పూర్తి చేయకుండానే వెళ్లిపోతావేంట్రా అని తిరుపతి అడుగుతాడు. ప్రేమను తీసుకొచ్చాకే పూర్తి చేస్తా అని అనేసి ధీరజ్ వెళ్లిపోతాడు. మరోవైపు సేనాపతి, భద్రావతి తమ కుట్రను కొనసాగిస్తారు. గుడిలో ప్రేమను తన భర్తతో వెళ్లిపోమని ఎందుకు చెప్పావని అడుగగా ఆమెను పంపించడానికి కాదు.. ధీరజ్ మీద ద్వేషం పెంచడానికి. అందరి ముందు కళ్యాణ్ విషయం చెప్పి అవమానించిన ధీరజ్ మీద ప్రేమకు ఇప్పటికే కోపం ఉంది. దానికి నేను విషపు మాటలు కలిపాను. ఇప్పుడు ప్రేమ నా మాట వింటుంది. ధీరజ్ మీదున్న కోపాన్ని అసహ్యంగా మార్చి, చివరికి వాడు నాకు వద్దని ప్రేమే చెప్పేలా చేస్తాను. వాడి తాళిని వాడి మొహం మీదే విసిరేలా చేసి, నా స్థాయికి తగ్గ సంబంధం చూసి పెళ్లి చేస్తానని భద్రవతి చెప్తుంది. మరోవైపు ఉదయాన్నే కోచింగ్‌కు బయలుదేరిన ప్రేమ, ధీరజ్ కోసం తెలియకుండానే వెతుకుతుంది. అది గమనించిన వల్లి.. నీ ధ్యాసలోనే మొగుడి కోసం కళ్లు వెతుకుతున్నాయి.. కాసేపు మాటలతో కుళ్లబొడిచేద్దామంటూ ప్రేమను పిలుస్తుంది.
చెల్లాయ్.. నీ కాపురం కూలిపోయినందుకు నాకు చాలా బాధ. ధీరజ్‌కు నీ మీద ప్రేమ లేదు. మీ కుటుంబం మీద పగతోనే నిన్ను అందరి ముందు అవమానించాడు. ముందు ముందు ఇంకా బాధపడే పరిస్థితి వస్తుంది. నీకు ప్రశాంతత కావాలంటే ఒక్కటే మార్గం.. ధీరజ్‌కు విడాకులు ఇచ్చేయ్ అని వల్లి అంటుంది. ఏయ్.. ఈ విషయాలన్నీ మళ్లీ మాట్లాడితే నీ చెంప పగలగొడతాను. ఎందుకు పిలిచావో చెప్పమని ప్రేమ అంటుంది. నేను నీ మంచి కోసమే చెప్తున్నాను చెల్లాయ్ అంటూ ధీరజ్‌పై లేనిపోనివి చెప్తుంది. దాంతో కోపంతో ఊగిపోయిన ప్రేమ ఒక్కసారిగా వల్లీని లాగిపెట్టి కొడుతుంది. దెబ్బకు వల్లీకి మైండ్ బ్లాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |